కావలసిన పదార్థాలు : క్యారెట్ తరుగు... ఒక కప్పు బీన్స్ తరుగు... ఒక కప్పు బ్రోకలి తరుగు... ఒక కప్పు చైనీస్ క్యాబేజీ తరుగు... ఒక కప్పు అస్పరగాన్ తరుగు.. ఒక కప్పు క్యాప్సికం తరుగు.. ఒక కప్పు జుకిని తరుగు... ఒక కప్పు బార్లీ ఆకులు... మూడు పండుమిరప పేస్ట్.. ఒక టీ. ఉల్లికాడలు... రెండు తెల్ల మిరియాలపొడి.. చిటికెడు ఉప్పు... తగినంత నూనె... ఒక టీ. మంచినీరు... రెండు కప్పులు
తయారీ విధానం : పాన్‌లో నూనె వేసి వేడయ్యాక పండుమిరప పేస్ట్‌ని వేసి ఫ్రై చేయాలి. అందులో ఉప్పు కూడా కలిపి మంచినీరు పోసి బాగా మరిగిన తరువాత తెల్ల మిరియాలపొడి కలిపి పైన చెప్పుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ వేసి ఐదు నిమిషాలపాటు ఉడకించాలి. చివరగా ఉల్లికాడలను తరగి, బార్లీ ఆకులతో కలిపి గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే థాయ్ ఫ్రైడ్ వెజిటబుల్స్ సిద్ధమైనట్లే..!