ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఈస్టర్ ముందు శుక్రవారం, ఈ ఏడాది ఏప్రిల్ 2 న వస్తుంది. చర్చి లూనార్ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం ఏప్రిల్ 4న పాస్చల్ పౌర్ణమి, మొదటి ఆదివారం ఈస్టర్ జరుపుకుంటారు. ఈ రోజున క్రైస్తవులు యేసుక్రీస్తు సిలువ వేయడాన్ని స్మరించుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు శోకం, తపస్సు, ఉపవాసం ఉన్న రోజు. అదే కారణంతో ఆ రోజును బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఇది క్రైస్తవులకు 40 రోజుల ఉపవాస కాలం.
ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి మూడు గంటల వరకు సేవలుంటాయి. ఈ సేవలలో క్రీస్తు సిద్ధాంతాల(నాలుగు గోస్పెల్స్)లోంచి ఏదో ఒక దానిని చదివి భక్తులకు వినిపించి వారి చేత కూడా చదివిస్తారు. ఆ తర్వాత చర్చిలలో ప్రవచనాలు, ధ్యానం మరియు ప్రార్థనలు జరుగుతాయి. ఈ సందర్భంగా క్రీస్తును ఎలా శిలువ చేసేరనే దానిపై మత పెద్దలు ఉపన్యాసం చేసి క్రీస్తును స్మరించుకుంటారు.