తయారీ విధానం : ఒక పాత్రలో కోడిగుడ్ల సొన పోసి ఎగ్ బీటర్‌తో బాగా గిలగొట్టాలి. అందులోనే చక్కెర పోసి మృదువుగా అయ్యేదాకా బాగా కలపాలి. మెత్తబడిన బటర్‌ను కూడా ఇందులో కలపాలి. మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్లను కలిపి జల్లించుకోవాలి. ఈ పౌడర్లను కూడా గుడ్ల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటినీ ఒక కేక్ పాత్రలో పోయాలి. వాల్‌నట్స్‌ను మైదాపిండిలో కొద్దిగా అద్ది కేక్ మిశ్రమంపైన అలంకరించాలి. మైక్రోవేవ్ ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్‌కు ముందుగానే వేడి చేసి పెట్టాలి. ఇప్పుడు కేక్ మిశ్రమం ఉండే పాత్రను అందులో ఉంచి 35 నుంచి 45 నిమిషాల వరకు బేక్ చేసి తీసేయాలి. అంతే చాకొలెట్ వాల్నట్ బ్రౌనీ తయార్..!