కావలసిన పదార్థాలు : మటన్.. అర కేజీ అల్లం, వెల్లుల్లి.. ఒక టీ. కారం.. ఒకటిన్నర టీ. జీలకర్ర.. పది గ్రా. గరంమసాలా.. 5 గ్రా. కొత్తిమీర.. ఒక కట్ట ముల్లంగి.. రెండు ఉల్లిపాయలు.. 75 గ్రా. పసుపు.. పావు టీ. గసగసాలు.. 20 గ్రా. ఉప్పు.. తగినంత నూనె.. 75 గ్రా.
తయారీ విధానం : ఒక గిన్నెలో నూనె పోసి స్టవ్‌మీద కాచిన తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి ఎర్రగా వేయించాలి. అందులో అల్లం, వెల్లుల్లి మిశ్రమం, కారం, పసుపు కలిపి వేయించాలి. కాసేపటికి శుభ్రం చేసిన మటన్‌ను వేసి బాగా కలియబెట్టి, గిన్నెమీద మూతపెట్టి సన్నటి మంటమీద ఉడికించాలి.
మటన్ సగం ఉడికిన తరువాత ముక్కలుగా తరిగిన ముల్లంగిని కలిపి ఉడికిస్తూ.. గసగసాలు, జీలకర్ర, గరంమసాలాలను మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని కూడా కూరలో కలిపి.. అవసరమైన కాసిన్ని నీళ్ళు, తగినంత ఉప్పు కూడా జతచేసి ఉడికించాలి. మటన్ పూర్తిగా ఉడికిన తరువాత, దించేందుకు ముందుగా కొత్తిమీర చల్లి.. వేడి వేడి రైస్‌తో వడ్డించాలి.