వెజ్ ప్రియుల స్పెషల్ "ఎగ్‌లెస్ వెనీలా కేక్"

FILE
కావలసిన పదార్థాలు :
మిల్క్‌మెయిడ్.. 400 గ్రా.
పాలు.. 300 ఎం.ఎల్.
వైట్ బటర్.. 180 గ్రా.
చక్కెర.. 15 గ్రా.
మైదా.. 150 గ్రా.
వంటసోడా.. 5 గ్రా.
బేకింగ్ పౌడర్.. 10 గ్రా.
వెనీలా ఎసెన్స్.. 10 ఎం.ఎల్.

తయారీ విధానం :
మైదా, వంటసోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించుకోవాలి. దీనికి మిల్క్‌మెయిడ్, పాలు, వెనీలా ఎసెన్స్, చక్కెర, వైట్ బటర్ కలిపి చిక్కగా చేసుకోవాలి. ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్‌ను ముందుగానే 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఉంచాలి. ఆ తరువాత ముందు కలుపుకున్న మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి.. ఓవెన్‌లో ఉంచి 20 నిమిషాలపాటు బేక్ చేసి తీసేయాలి. అంతే ఎగ్‌లెస్ వెనీలా కేక్ రెడీ..!

వెబ్దునియా పై చదవండి