శక్తినిచ్చే ఆహారం "ఫ్రూట్ అండ్ వెజ్ సలాడ్"

FILE
కావలసిన పదార్థాలు :
కీరదోసకాయ.. ఒకటి
ఆపిల్... ఒకటి
పుచ్చకాయ.. చిన్న ముక్క
సపోటా.. ఒకటి
బత్తాయి.. ఒకటి
దానిమ్మకాయ.. ఒకటి
దానిమ్మగింజలు.. అర కప్పు

తయారీ విధానం :
కీరదోసకాయ చెక్కుతీసి చక్రాల్లాగా తరగాలి. ఆపిల్, పుచ్చకాయ, సపోటా ముక్కలను, బత్తాయి తొనలను అందంగా అలంకరించి.. ఖాళీలలో దానిమ్మ గింజలను నింపితే ఆకర్షణీయంగా ఉంటుంది. రంజాన్ మాసంలో పగలంతా ఉపవాసం (రోజా) ఉన్నవాళ్లు తీసుకునే మొదటి ఆహారం ఇది. ప్రకృతి ఆహారంతో ఫాస్టింగ్‌ను ముస్లిం సోదరులు ఇలా బ్రేక్ చేస్తారన్నమాట. ఆ తర్వాతనే మసాలాలతో కూడిన రుచికరమైన పదార్థాలను, శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకుంటారు.

వెబ్దునియా పై చదవండి