కావలసిన పదార్థాలు : ఎముకలు లేని బాయిల్డ్ చికెన్.. అర కేజీ వెల్లుల్లి పేస్ట్.. 15 గ్రా. నూనె.. 50 గ్రా. రెడ్ ఫుడ్ కలర్.. 2 గ్రా. పసుపు.. ఒక టీ. కొత్తిమీర.. ఒక కట్ట గరంమసాలా.. 5 గ్రా. అల్లం పేస్ట్.. 15 గ్రా. ఉల్లిపాయలు.. 4 కారం.. 5 గ్రా. పెరుగు.. వంద గ్రా. ఉప్పు.. తగినంత
తయారీ విధానం : చికెన్ ముక్కలకు గరంమసాలా, అల్లంవెల్లుల్లి మిశ్రమం, కారం, రెడ్ ఫుడ్ కలర్, పెరుగు, పసుపు, తగినంత ఉప్పు కలిపి అరగంటసేపు నానబెట్టాలి. ఒక గిన్నెలో నూనె పోసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి, ఆపై నానబెట్టిన చికెన్ ముక్కల్ని కూడా వేసి సన్నటి మంటపై ఇగిరిపోయేంతదాకా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చిసిన చికెన్ ముక్కలపై కొత్తిమీర చల్లి, ఉల్లిపాయ ముక్కలతో కలిపి సర్వ్ చేస్తే అదిరిపోతుంది.