కాకరకాయ ఉల్లికారం..?

శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (11:15 IST)
కావలసిన పదార్థాలు:
కాకరకాయలు - పావుకిలో
ఉల్లికారం - 2 స్పూన్స్
ఉప్పు - తగినంత
జీలకర్ర - స్పూన్
నూనె - సరిపడా
కరివేపాకు - 2 రెమ్మలు
కొత్తిమీర - 1 కట్ట
 
తయారీ విధానం:
ముందుగా కాకరకాయలు తొక్కుతీసి కడిగి మధ్యకు కట్ చేసుకోవాలి. ఈ ముక్కలకు గాట్లు పెట్ట పక్కనుంచాలి. ఇప్పుడు ఉల్లికారం, ఉప్పు కలుపుకోవాలి. ఈ ముద్దను గాట్లు పెట్టిన కాకరకాయల్లో పెట్టి పక్కనుంచాలి. తరువాత బాణలిలో నూనెను వేడిచేసి అందులో జీలకర్ర, కరివేపాకు వేయింజి.. కాసేపటి తరువాత కాకరకాయ ముక్కలు వేసి మూతపెట్టి చిన్నమంట మీద ఉడికించాలి. మధ్యమధ్యలో కాకర ముక్కల్ని గరిటెతో తిప్పుతూ అన్ని వైపులా సమంగా ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికాక కొత్తిమీర చల్లి దింపేయాలి. అంతే కాకరకాయ ఉల్లికారం రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు