ద్రాక్ష రైతా..?

మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (10:49 IST)
ద్రాక్షపండ్లు ఆరోగ్యానికి మంచి టానిక్‌లా పనిచేస్తాయి. ద్రాక్షపండ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రతిరోజూ రాత్రివేళ భోజనాంతరం ద్రాక్షపండ్లు తింటే.. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దాంతో పాటు చక్కని నిద్ర కూడా వస్తుంది. ఇలాంటి ద్రాక్షపండ్లతో రైతా ఎలా చేయాలో తెలుసుకుందాం...
 
కావలసిన పదార్థాలు:
పెరుగు - 2 కప్పులు
ద్రాక్షపండ్లు - 1 కప్పు
చక్కెర - ఒకటిన్నర స్పూన్
ఉప్పు - సరిపడా
జీలకర్ర పొడి - రెండు స్పూన్
కారం - కొద్దిగా
పుదీనా - కొద్దిగా.
 
తయారీ విధానం:
ముందుగా చిక్కటి పెరుగును పెద్ద గిన్నెలో వేసి గిలక్కొట్టి జారుగా చేయాలి. ఆ తరువాత అందులో ద్రాక్షపండ్ల ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై జీలకర్రపొడి, పుదీనా ఆకులతో అలంకరించాలి. ఈ రైతాను పులావ్, బిర్యానీలతో తినొచ్చు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు