కావలసిన పదార్థాలు : సోల్ ఫిష్.. ఒక కేజీ మొక్కజొన్న పిండి.. 200 గ్రా. మైదాపిండి.. 150 గ్రా. కోడిగుడ్డు.. ఒకటి బేకింగ్ పౌడర్... చిటికెడు స్వీట్ చిల్లీ జామ్.. 400 గ్రా. ఆవాలు.. వంద గ్రా. వెల్లుల్లి... 50 గ్రా. ఆలీవ్ ఆయిల్.. 150 మి.లీ. నిమ్మకాయ రసం.. 150 మి.లీ. మిరియాలపొడి.. తగినంత ఉప్పు.. సరిపడా
తయారీ విధానం : సోల్ ఫిష్‌ను ముళ్లు లేని విధంగా ముక్కలుగా కోసుకోవాలి. ఆవాలు పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, ఆలీవ్ ఆయిల్, నిమ్మరసం, మిరియాలపొడి, ఉప్పులను చేప ముక్కలపై వేసి బాగా కలిపితే ఆ పేస్ట్ చేప ముక్కలకు పైపూతలాగా పడుతుంది. తరువాత మొక్కజొన్న పిండి, మైదాపిండి, కోడిగుడ్డు సొన, బేకింగ్ పౌడర్లను మరో గిన్నెలో వేసి బజ్జీల పిండిలాగా బాగా కలిపి ఉంచాలి.
బాణలిలో నూనె పోసి మరుగుతుండగా.. చేప ముక్కలను పై పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. అలా వేయించిన చేప ముక్కల్ని ఒక ప్లేటులో సర్ది.. అందులోకి వేయించిన వెల్లుల్లి ముక్కలు, స్వీట్ చిల్లీ జామ్ వేస్తే టోన్డ్ ఫిష్ రెడీ అయినట్లే..!