తయారీ విధానం : బటర్‌ను క్రీమ్‌లాగా చేయాలి. దాంట్లో పంచదార వేసి మెత్తగా అయ్యేదాకా కలపాలి. ఇందులోనే ఏలకులు, జాజికాయపొడి కూడా వేసి కలపాలి. ఆపై డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసి స్పూన్‌తో మృదువుగా అయ్యేవరకు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో కొద్ది కొద్దిగా ఉండలుగా తీసుకోవాలి.
గుండ్రటి ఉండను చేత్తో కొద్దిగా ఒత్తుకుని నెయ్యి రాసిన ట్రేలో పెట్టాలి. అన్ని కుకీస్‌ను ఇలాగే చేసి ట్రేలో పెట్టాలి. ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్‌ను 180 డిగ్రీలలో వేడి చేసి, అందులో ఈ ట్రేను ఉంచి, 15 నిమిషాలపాటు లేత గోధుమరంగు వచ్చేదాకా బేక్ చేయాలి. చల్లారిన తరువాత సర్వ్ చేయాలి. అంతే కోకోనట్ కుకీస్ రెడీ..!