కావలసిన పదార్థాలు : రాస్బెర్రీ జెల్లీ.. రెండు ప్యాకెట్లు పాలు.. ఏడు కప్పులు నిమ్మరసం.. రెండు టీ. వెన్న.. రెండు టీ. బ్రౌన్ షుగర్.. రెండు టీ. మిక్స్డ్ ఫ్రూట్స్.. నాలుగు కప్పులు బాదం పప్పులు.. పది ఆపిల్ ముక్కలు.. కాసిన్ని
తయారీ విధానం : వేడిపాలలో రాస్బెర్రీ జెల్లీ వేసి బాగా కరిగిపోయేదాకా తిప్పాలి. చల్లారాక గుండ్రని గిన్నెలో పోసి నాలుగైదు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. మరో గిన్నెలో ఆపిల్ ముక్కలు వేసి కొద్దిగా నిమ్మరసం చల్లి బాగా కలపాలి. ఇలా చేస్తే ముక్కలు నల్లబడవు. నానబెట్టిన బాదం పప్పులను పొడవైన ముక్కలుగా కోసి ఉంచాలి. తినేముందు వెన్నని వేడి చేసి అందులో బ్రౌన్‌షుగర్ వేసి తిప్పాలి. అది కరిగిన తరువాత తాజా పండ్ల ముక్కలు, నిమ్మరసం కలిపి ఉన్న ఆపిల్ ముక్కలు, బాదం ముక్కలు వేసి బాగా కలపాలి.
చివరగా ఫ్రిజ్‌లో నుండి జెల్లీ ఉన్న గిన్నె తీసి.. చాకుతో అంచులని పైకిలేపి ఒక్కక్షణం గోరువెచ్చని నీటిలో ఉంచి తీయాలి. తరువాత దానిని తడి ఫ్లేటులో నునుపుగా ఉన్న భాగం పైకివచ్చేలా అమర్చాలి. పండ్లముక్కలని, కస్టర్డ్‌ని చక్కగా పొరలు పొరలుగా వరుసగా అలంకరించాలి. అంతే పసందైన డెజర్ట్ తయారైనట్లే..! ఓసారి ట్రై చేసి చూడరూ..?!