కావలసిన పదార్థాలు : పెసరపప్పు.. ఒక కప్పు జీలకర్ర.. ఒక టీ. పచ్చిమిర్చి.. 2 ఎండుమిర్చి.. 2 అల్లంతురుము.. ఒక టీ. కరివేపాకు రెబ్బలు.. 2 పసుపు.. పావు టీ. ఇంగువ.. చిటికెడు ఉప్పు.. రుచికి సరిపడా నెయ్యి.. ఒక టీ. నిమ్మరసం.. ఒక టీ. కొత్తిమీర తరుగు.. కాస్తంత
తయారీ విధానం : ముందుగా పెసరపప్పును మూడు కప్పుల నీటిలో మెత్తగా ఉడికించుకోవాలి. పాత్రలో నెయ్యి వేడయ్యాక.. జీలకర్ర వేసి చిటపటలాడుతుండగా.. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తురుము వేసి అర నిమిషంపాటు వేయించుకోవాలి. ఇంగువ, పసుపు, ఉడికించుకున్న పప్పు మిశ్రమాన్ని, పప్పు నీటిని వేసి.. తగినంత ఉప్పుకూడా చేర్చి బాగా కలియబెట్టాలి.
దీనిని తక్కువ మంటమీద పది నిమిషాలపాటు ఉడికించి.. దించేముందు నిమ్మరసం, కొత్తిమీర తరుగు చల్లాలి. సూప్ మరింత జారుగా ఉండాలంటే ఇంకొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. అంతే వేడి వేడి మూంగ్దాల్ సూప్ తయార్..!