వెరైటీ బాయిల్డ్ ఎగ్ స్నాక్స్ "కైమా పప్స్"

FILE
కావలసిన పదార్థాలు :
కైమా.. పావు కేజీ
ఉల్లితరుగు.. పావు కేజీ
పచ్చిమిర్చి తరుగు.. రెండు టీ.
అల్లం వెల్లుల్లి ముద్ద.. రెండు టీ.
కొత్తిమీర తరుగు.. ఒక టీ.
ధనియాలపొడి.. ఒక టీ.
పసుపు.. చిటికెడు
గరంమసాలా.. అర టీ.
ఉడికించిన కోడిగుడ్లు.. మూడు
గోధుమపిండి.. 200 గ్రా.
ఉప్పు.. తగినంత
నూనె.. సరిపడా
కరివేపాకు.. కాస్తంత

తయారీ విధానం :
కైమాకు కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు చేర్చి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. గోధుమ, మైదా పిండికి కొద్దిగా ఉప్పు, నీళ్ళు చేర్చి చపాతీ పిండిలా కలిపి విడిగా పెట్టుకోవాలి. బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు.. అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, కరివేపాకును వేసి దోరగా వేయించి కైమా ముద్దలో కలపాలి.

కలిపి ఉంచిన పిండిని చిన్నపూరీల్లా ఒత్తి, చివర్లు కత్తితో కోస్తే చతురస్త్రాకారం అవుతుంది. అందులో రెండు టీస్పూన్ల కైమా కూరను వేసి చపాతీ అంతా రాయాలి. సగానికి కోసి ఉన్న కోడిగుడ్డు ముక్కను మధ్యలో ఉంచాలి. ఇప్పుడు మరో చపాతీని పై విధంగా ఒత్తి, మొదటి దానిపై పెట్టి నాలుగు చివర్లు కలుపుతూ అతికించాలి. అలా మొత్తం చేసి కాగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించాలి. అంతే కైమా పప్స్ రెడీ..! పుదీనా, కొత్తిమీర చట్నీలతో తింటే టేస్టీగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి