మాంసం ముక్కల్లో క్యారెట్ ముక్క వేసి ఉడికిస్తే..?

శనివారం, 12 డిశెంబరు 2015 (19:05 IST)
ఆదివారం ఇక నాన్ వెజ్ లాగించేయాల్సిందేనని అందరూ అనుకుంటారు. అయితే మాంసంలోని కొవ్వు పదార్థాలతో ఒబిసిటీ వంటి ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటారు. అందుకే మాంసం ముక్కల్లో క్యారెట్ ముక్క వేసి ఉడికిస్తే మాంసంలోని కొవ్వుని క్యారెట్ పీల్చుకుంటుంది. ఉడికిన క్యారెట్‌ను బయటకు తీసి పారేసినా ఓకే లేకుంటే మిగిలిన కాయగూరలతో కలిపి సూప్ కూడా చేసుకోవచ్చు. పిల్లలకు ఆ సూప్‌ని తాగించవచ్చు. 
 
అలాగే మష్రూమ్‌లను ప్లాస్టిక్ బ్యాగ్‌లో కాకుండా పేపర్ బ్యాగులో చుట్టి ఫ్రిజ్‌‍లో ఉంచితే ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. మొక్కజొన్నను ఉడికించేటప్పుడు నీళ్లలో చిటికెడు పంచదార వేసి ఉడికిస్తే రుచిగా ఉంటుంది. పిండిని పూరీల్లా చేశాక వాటిని ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత నూనెలో వేయిస్తే.. పూరీలు తక్కువ నూనెను పీల్చుకుంటాయి.

వెబ్దునియా పై చదవండి