అసలు మైదా పిండి తెల్లగా ఎందుకు ఉంటుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్య పోవాల్సిందే. మిల్లులో బాగా పోలిష్ చేసిన గోధుమ పిండిని అజోడికార్బొనమైడ్, క్లోరిన్ గ్యాస్, బెంజాయిల్ పెరాక్సైడ్ అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. ఇందులో బెంజాయిల్ పెరాక్సైడ్ రసాయనాన్ని చైనా ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదాలో అల్లోక్సాన్ అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.
ఇలాంటి మైదా పిండితో తయారు చేసిన వంటకాలను ఆరగించడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకూ దారితీస్తాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మహిళలు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది. ఇక ప్రొటీన్లు చాలా నామ మాత్రంగా ఉంటాయి.