కరోనావైరస్: డేంజర్ జోన్‌గా హైదరాబాదు

శనివారం, 18 జులై 2020 (17:58 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ డేంజర్ బెల్‌ను మోగిస్తున్నది. హైదరాబాదు నగరంలో కరోనా కేసులు రెట్టింపు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీంతో హైదరాబాదు ఇప్పుడు హాట్ స్పాట్‌గా మారిపోయింది. కేసులను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఎన్నో సూచనలను ప్రకటిస్తున్నది. ఇందులో భాగంగా నగరంలో దాదాపు 2.22 లక్షలకు పైగా టెస్టులు చేసింది.
 
వీటికి కావలసిన ర్యాపిడ్ టెస్టు కిట్లను 2 లక్షల వరకు తెచ్చి సరఫరా చేసింది. అవి సరిపోని పక్షంలో దక్షిణ కొరియా సంస్థకు ఆర్డర్లు పెట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు హైదరాబాదు పరిసర ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో టెస్టులు నిర్వహించారు. ఇక జిల్లాల్లో కేసులు పెరగడంతో వాటిని జిల్లాలకు తరలించనున్నారు. ఒక్కో పీహెచ్‌సిలో రోజుకు వంద టెస్టులు నిర్వహించాలని అధికారులు లక్ష్యంగా ఎన్నుకున్నారు.
 
ర్యాపిడ్ టెస్టులు త్వరితంగా ఫలితాలు వస్తున్నాయని మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎండీ కె.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఐసీఎంఆర్ అనుమతి పొందిన సంస్థల నుండి ర్యాపిడ్ కిట్లను కొనుగోలు చేస్తున్నామని  తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు