ఇప్పటికే టీవీ నటులు ప్రభాకర్, హరికృష్ణ, నవ్యకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు పెరగడంతో టీవీ నటుల్లో ఆందోళన మొదలైంది.
మరోవైపు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. పలు పార్టీలకు చెందిన కీలక నేతలకు సైతం కరోనా సోకింది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.