ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. అయితే, ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఫార్మా కంపెనీలు టీకాలను తయారు చేశాయి. వీటిలో కొన్నింటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. ఈ టీకాలను అత్యవసర వినియోగం కింద భారత్‌లో కూడా పంపిణీ చేయనున్నారు.
ఇందులోభాగంగా, వ్యాక్సిన్ పంపిణీ కోసం ముందస్తు ఏర్పాట్లకు కేంద్రం చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా శనివారం డ్రై రన్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో రాజధానుల్లోకాకుండా ఇతర ప్రధాన నగరాల్లో డ్రై రన్ నిర్వహించే అవకాశం ఉంది. అస్సాం, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఇప్పటికే గత నెల 28, 29న తొలి విడుత డ్రై రన్ కొనసాగిన విషయం తెలిసిందే.