ఏపీలో కొత్తగా మరో 1445 కరోనా పాజిటివ్ కేసులు

బుధవారం, 15 సెప్టెంబరు 2021 (20:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 1445 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 62,252 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 1,445 మందికి కరోనా నిర్ధారణ అయింది. 
 
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 274, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 11 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వల్ల 11 మంది మృతి చెందారు. 1,243 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. 
 
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,33,419కి చేరుకుంది. ఇప్పటి వరకు 20,04,786 మంది కోలుకున్నారు. మొత్తం 14,030 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,603 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు