ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. విశాఖపట్టణం జిల్లాలోని అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మైనర్లపై తండ్రీ తనయులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఇద్దరు మైనర్ బాలికలు కబడ్డీ శిక్షణకు తీసుకుంటూ వస్తున్నారు. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లాలోని అచ్యుతాపురం పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన బాపయ్య (50), ఆయన కుమారుడు నూకలు (27) కలిసి కబడ్డీ శిక్షణా కేంద్రం నిర్వహిస్తున్నారు. దీంతో కబడ్డీ శిక్షణ కోసం పిల్లలు వస్తున్నారు. ఇందులో ఓ ఇద్దరు అమ్మాయిలపై బాపయ్య, నూకలు కన్నేశారు.
వారిని ఒంటరిగా నిర్బంధించి అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బాధిత చిన్నారులు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బాధిత అమ్మాయిలు తమ తల్లిదండ్రుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాపయ్య, నూకలు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.