తితిదే పాలక మండలి సభ్యులు వీరే

బుధవారం, 15 సెప్టెంబరు 2021 (16:40 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలికి కొత్త సభ్యులను ఏపీ ప్రభుత్వం నియమించింది. మొత్తం 25 మంది సభ్యులతో ఈ పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఈ జాబితాను మంగళవారం ప్రకటించింది. తితిదే ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డికి రెండోసారి అవకాశం కల్పించిన విషయం తెల్సిందే. 
 
ఈ మండలిలో సభ్యులుగా ఏపీ నుంచి పొలకల అశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని, గోర్ల బాబూరావు, మధుసూదన్ యాదవ్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జూపల్లి రామేశ్వరరావు, లక్ష్మీనారాయణ, పార్దసారథి రెడ్డి, మూరంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యా సాగర్‌లకు ఛాన్స్ దక్కింది.
 
మరోవైపు తమిళనాడు నుంచి శ్రీనివాసన్, ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్యలకు అవకాశం కల్పించగా, కర్ణాటక నుంచి శశిధర్, ఎమ్యెల్యే విశ్వనాధ్ రెడ్డిలకు చోటు కల్పించారు. అలాగే మహారాష్ట్ర నుంచి శివసేన కార్యదర్శి మిలింద్‌కు ఏపీ సర్కారు చోటు కల్పించింది. టీటీడీ పాలకమండలి జాబితాలో ఏపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంపిక కావడం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు