వామ్మో..! తమిళనాడు సీఎం కార్యాలయ ఉద్యోగి కరోనాతో మృతి

బుధవారం, 17 జూన్ 2020 (13:37 IST)
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తమిళనాడులో ఇప్పటికే కరోనా బారినపడి డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ ఘటన మరవకముందే తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిలో ఒకరు కరోనా సోకి మృతి చెందినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. 
 
కాగా సీఎం పళనిస్వామి పీఏగా పనిచేస్తున్న దామోదరన్‌ రెండు రోజుల క్రితమే కోవిడ్‌-19 లక్షణాలతో చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందతూ బుధవారం దామోదరన్‌ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో సీఎం కార్యాలయంలో కరోనా భయం పట్టుకుంది. దామోదరన్‌తో పనిచేసిన వ్యక్తులకు కరోనా సోకిందా లేదా అనే దానిపై ఆరా తీస్తున్నారు. 
 
ఇక చైన్నైలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఈ నెల 19నుంచి 12 రోజులపాటు మరోసారి పూర్తి లాక్‌డౌన్‌ చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే, తమిళనాడులో ఇప్పటివరకు 48,019 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 528మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఒక్కరోజే.. తమిళ రాష్ట్రంలో 1515 పాజిటివ్‌ కేసులు నమోదు, కాగా 49మంది మృత్యువాతపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు