దేశంలో కొత్తగా మరో 10,853 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, 12,432 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,44,845 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు.
మరోవైపు, కరోనాతో గత 24 గంటల్లో 526 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి ఇప్పటివరకు మొత్తం 3,37,49,900 మంది కోలుకున్నారు. కరోనా వల్ల దేశంలో మొత్తం 4,60,791 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలావుంటే, దేశ వ్యాప్తంగా 28,40,174 డోసుల కరోనా వ్యాక్సిన్ వినియోగించారు. మొత్తం 1,08,21,66,365 డోసుల వ్యాక్సిన్లు వాడారు. తమిళనాడు రాష్ట్రంలో ఇంటింటికి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. వైద్య సిబ్బందే ప్రతి ఒక్కరి ఇంటికి కరోనా వ్యాక్సిన్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.