దక్షిణాఫ్రికా విమానాల్లో వచ్చిన 600 మంది ప్రయాణీకుల్లో పెద్దసంఖ్యలో ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు డచ్ ఆరోగ్య అధికారులు తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో డచ్ హెల్త్ అథారిటీ మాట్లాడుతూ... శుక్రవారం రెండు విమానాలలో ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ విమానాశ్రయానికి వచ్చిన 624 మంది ప్రయాణికులలో ఓమిక్రాన్ లక్షణాలతో వున్న ప్రయాణికులు వున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
బహ్రెయిన్, సౌదీ అరేబియా, సూడాన్ ఆఫ్రికన్ దేశాల నుండి విమానాలను నిషేధించాయి. ఫ్రాన్స్ దేశ ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ... ఓమిక్రాన్ వేరియంట్ బహుశా ఇప్పటికే ఫ్రాన్స్‌లో తిరుగుతోంది, దానిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేస్తోందని అన్నారు.