Corona: ఉద్ధృతి కొద్దిగా తగ్గినా 40వేల పైనే కొత్త కేసులు

సోమవారం, 2 ఆగస్టు 2021 (10:53 IST)
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా నిత్యం 40 వేలపైనే కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 14,28,984 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..40,134 కొత్త కేసులు వెలుగుచూశాయి.

క్రితం రోజుతో పోల్చితే 4 శాతం మేర తగ్గాయి. కేరళలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ మళ్లీ 20వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఇక నిన్న 422 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 3.16 కోట్లకు చేరగా.. 4.24 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు.
 
ఇటీవల కాలంలో క్రియాశీల కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 4,13,718 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.30 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.36 శాతానికి చేరింది. నిన్న 36,946 మంది కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.08 కోట్లుగా ఉంది. మరోవైపు నిన్న 17లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 47.22కోట్ల డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు