దేశంలో 5.63 శాతానికి తగ్గిన క్రియాశీల కేసులు

శుక్రవారం, 13 నవంబరు 2020 (20:12 IST)
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా 50 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 44,879 కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే, గత కొద్ది రోజులుగా క్రియాశీల కేసులు సంఖ్య ఐదు లక్షల మార్కు కంటే తగ్గడం ఊరట కలిగించే అంశం. 
 
గురువారం ఆ కేసులు సంఖ్య 4,84,547గా ఉంది. ఇది మొత్తం కేసుల్లో 5.63శాతాం. కోలుకున్న వారిశాతం 92.89 శాతంగా ఉంది. ఇక, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 87,28,795 మంది వైరస్ బారినపడగా, వారిలో 81,15,580 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు.
 
గురువారం ఒక్కరోజే కోలుకున్న వారి సంఖ్య 49,079గా ఉంది. ఈ మహమ్మారి కారణంగా గురువారం 547 మరణాల సంభవించగా, ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి 1,28,668 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, గత 24 గంటల్లో ప్రభుత్వం 11,39,230 నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు