ఒమిక్రాన్​కు చెక్ పెట్టే కోవాగ్జిన్.. భారత్ బయోటిక్ గుడ్ న్యూస్

శుక్రవారం, 3 డిశెంబరు 2021 (12:08 IST)
హైదరాబాద్​లోని భారత్ బయోటెక్ తయారు చేసిన 'కోవాగ్జిన్' కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుందని గుడ్​న్యూస్​ చెప్పింది. అందుబాటులో ఉన్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా కోవాగ్జిన్​ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించింది. 
 
అయితే, ఒమిక్రాన్​పై ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు​ మరిన్ని నమూనాలను స్వీకరించి పరీక్షించాల్సి ఉందని, అప్పుడే మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.
 
దీనిపై ఐసీఎంఆర్​ అధికారి మాట్లాడుతూ ''కోవాగ్జిన్ అనేది వైరియన్ -ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్. ఇది మొత్తం వైరస్‌ను అంతం చేసేలా కవర్ చేస్తుంది. ఇది అత్యంత పరివర్తన చెందిన కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా పని చేస్తుంది." అని వివరించారు. 
 
కోవాగ్జిన్ కేవలం ఒమిక్రాన్​పైనే కాదు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వంటి ఇతర వేరియంట్లపై కూడా బాగా పనిచేస్తుందని అధికారి పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు