ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు, ఒక్క రోజే 44 మంది మృతి

బుధవారం, 15 జులై 2020 (17:39 IST)
ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 2,412 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో22,197 శాంపిల్స్‌ను పరిశీలించగా 2, 412 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు.
 
మరోవైపు 805 మంది చికిత్సతో కోలుకొని డిశ్చార్జ్ య్యారు. ఇదిలావుండగా కోవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 44 మంది మృతి చెందారు. కోవిడ్-19 కారణంగా అధిక మరణాలు సంభవించడం ఏపీలోఇదే తొలిసారి. అనంతపురం జిల్లాలో 9 మంది, పశ్చిమ గోదావరి 9, కర్నూలు 5, చిత్తూరు 4, తూర్పు గోదావరి 4, విశాఖపట్నం 4, కడప 2, కృష్ణా 2ప్రకాశం 2, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోఒక్కొక్కరు కరోనా కారణంగా చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ తెలిపింది.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 32,575. ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 452. వివిధ ఆస్పత్రిలలో చికిత్స నిమిత్తం కోలుకొని ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 16,032కు చేరింది. ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆస్పత్రిలలో 16,091 మంది చికిత్స పొందుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు