తెలుగు, మరాఠి, మళయాళం, పంజాబీ, గుజరాతి, అస్సామీ, బెంగాలీ, ఒడియా భాషల్లోనూ రిజిష్ట్రేషన్ చేయించుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వారు టీకా వేయించుకోవాలంటే రిజిష్ట్రేషన్ తప్పనిసరి. దీంతో రిజిష్ట్రేషన్ సమయంలో భాషతో సమస్యగా మారింది.
ఇందుకోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువకులు కోవిడ్ సిబ్బంది సహాయం తీసుకుంటున్నారు. దీంతో వారిపై పని భారం పెరిగిపోయింది. దీన్ని తగ్గించాలనే ఉద్ధేశ్యంతోనే ప్రాంతీయ భాషల్లోనూ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.