దేశంలో కోట్లాది మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వీరిలో లక్షలాది మంది ఇప్పటికీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారు. ప్రతి రోజూ వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న, లేదా చికిత్స ముగించుకుని ఇంటికి చేరుకున్న కరోనా రోగులు ప్రత్యేకంగా ఆహార నియమం పాటించాలని కోరుతున్నారు. ఈ భోజన నియమాలతో నిస్సత్తువ, నీరసం వదిలి, కోలుకునే వేగం పెరుగుతుంది.
ఆ ఆహార ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. నిద్ర లేచి వెంటనే, నీళ్లలో నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష తినాలి. బాదంలో మాంసకృత్తులు, ఎండుద్రాక్షలో ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొవిడ్ తాలూకు నీరసాన్ని వదిలిస్తాయి.