అయితే ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ డాక్టర్ ప్రాణాలు విడిచారు. నాలుగు దశాబ్ధాలుగా ఖైరతాబాద్‌లో డాక్టర్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. కాగా, వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా..సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో తొలుత లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
మరోసారి లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరిగినా.. అది సాధ్యం కాదని తేలిపోయింది. ఈ తరుణంలో.. స్వీయ నియంత్రణే శరణ్యమని కొంతమంది ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాలు తమంతట తమే లాక్ డౌన్ విధించుకుంటున్నారు. మొన్న భిక్కనూరు, నిన్న గంభీరావు పేట, నేడు ఇబ్రహీంపట్నం. ఇలా లాక్ డౌన్ ప్రకటించుకుంటున్నారు.