దేశంలో 80 వేలు దాటిన కరోనా మరణాలు.. తెలంగాణాలో ఎన్ని?

మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (10:11 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి చేపడుతున్న చర్యలు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఫలితంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో మరో 83 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వెల్లడించారు. 
 
తాజాగా గడిచిన 24 గంటల్లో 83,809 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,30,237కు చేరింది. ప్రస్తుతం 9,90,061 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, 38,59,400 మంది వైరస్‌ ప్రభావం కోలుకున్నారని తెలిపింది. 
 
వైరస్‌ ప్రభావంతో తాజాగా మరో 1,054 మంది మరణించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మహమ్మారి కారణంగా 80,776 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. కాగా, దేశవ్యాప్తంగా సోమవారం ఒకే రోజు 10,72,845 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. 
 
తెలంగాణాలో 1.60 లక్షల కేసులు 
ఇకపోతే, తెలంగాణాలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,058 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,60,571కు చేరింది. తాజాగా మరో 2,180 మంది కోలుకోగా.. 1,29,187 మంది డిశ్చార్జ్ అయినట్టు తెలిపింది.
 
వైరస్‌ ప్రభావంతో మరో 10 మంది మృత్యువాతపడగా.. ఇప్పటివరకు 984 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,400 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపింది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.61శాతంగా ఉండగా, రికవరీ రేటు 80.45శాతంగా ఉందని వివరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు