బంధనంలోకి భారతం: అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు, లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు

సోమవారం, 10 మే 2021 (20:12 IST)
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాలు యథాశక్తి కఠిన చర్యలు చేపడుతున్నాయి. లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలతో పాటు అనేక ఆంక్షలు విధించాయి.

లాక్‌డౌన్‌లు ఎక్కడెక్కడ?
* దిల్లీలో ఇప్పటికే అమలవుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించారు. మెట్రో రైలు సేవలను కూడా రద్దు చేశారు.
 
* తమిళనాడు, రాజస్థాన్‌, పుదుచ్ఛేరిల్లో సోమవారం నుంచి రెండు వారాల పాటు అమలు చేస్తారు.
 
* హరియాణాలో ఈనెల 17 వరకు పొడిగించారు. ఇంతకుముందు 9 జిల్లాల్లో వారంతపు కర్ఫ్యూను అమలు చేశారు.
 
* కేరళలో 9 రోజులు (శనివారం నుంచి), మిజోరమ్‌లో 7 రోజుల (సోమవారం నుంచి) పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.
 
* బిహార్‌లో ఈ నెల 15 వరకూ కొనసాగుతుంది.
 
* ఒడిశాలో 14 రోజుల లాక్‌డౌన్‌ ఈనెల 19 వరకు అమల్లో ఉంటుంది.
 
* నాగాలాండ్‌లో కఠిన నిబంధనలతో పాక్షికంగా ఈనెల 14 వరకు అమలు చేస్తున్నారు.
వారాంతాల్లో
 
* చండీగఢ్‌లో వారాంతపు లాక్‌డౌన్‌లు కొనసాగుతున్నాయి.
 
* ఛత్తీస్‌గఢ్‌లోనూ వారాంతపు లాక్‌డౌన్‌ విధించారు. స్థానికంగా అమలు చేసే లాక్‌డౌన్‌లను ఈనెల 15 వరకు పొడిగించుకోవచ్చని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
 
* పంజాబ్‌లో ఈనెల 15 వరకు వారాంతపు లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూలతో పాటు కఠిన నిబంధనలు విధించారు.
 
లాక్‌డౌన్‌ తరహా
* మహారాష్ట్రలో ఏప్రిల్‌ 5న ప్రారంభించిన నిబంధనలను ఈనెల 15 వరకు పొడిగించారు.
 
* ఉత్తర్‌ప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలతో కూడిన కరోనా కర్ఫ్యూని ఈనెల 17 వరకు పొడిగించారు.
 
* ఝార్ఖండ్‌లో ఈనెల 13 వరకు పొడిగించారు.
 
* కర్ణాటకలో ఈనెల 24 వరకు అమలు చేస్తున్నారు. ః సిక్కింలో ఈనెల 16 వరకు ఆంక్షలు విధించారు.
 
* జమ్మూ-కశ్మీర్‌ అధికార యంత్రాంగం ఈనెల 10 వరకు నిబంధనలను అమలు చేస్తోంది.
కర్ఫ్యూలు
 
* గోవా ప్రభుత్వం ఈనెల 9 నుంచి 24 వరకు అమలు చేస్తోంది.
 
* మధ్యప్రదేశ్‌లో ఈనెల 15 వరకు జనతా కర్ఫ్యూ విధించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
 
* గుజరాత్‌లో రాత్రివేళ కర్ఫ్యూ అమల్లో ఉండగా పగటిపూట ఆంక్షలు 36 నగరాల్లో ఈనెల 12 వరకు అమలు చేస్తున్నారు.
 
* అస్సాంలో కర్ఫ్యూ రాత్రి 8 నుంచి అమలు చేస్తుండగా ఇకపై సాయంత్రం 6 గంటల నుంచే విధిస్తున్నారు.
 
* అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సాయంత్రం 6.30 నుంచి ఉదయం 5 వరకు రాత్రి ఈ నెల మొత్తం అమలు చేస్తోంది.
 
* మణిపుర్‌లోని 7 జిల్లాల్లో ఈనెల 8 నుంచి 17 వరకు కర్ఫ్యూ.
 
* ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ సహా పలు నిబంధనలను తిరిగి విధించింది.
 
* హిమాచల్‌ప్రదేశ్‌ ఈనెల 7 నుంచి 16 వరకు లాక్‌డౌన్‌ లేదా కరోనా కర్ఫ్యూ పేరిట నిబంధనలు విధించింది.
 
* పశ్చిమబెంగాల్‌లో గత వారం నుంచి కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు