ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరప్‌పై వైద్యులు యుద్ధం చేస్తున్నారు. కంటికి కనిపించని శత్రువుపై తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వారు చేస్తున్ పోరాటంపై ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. కరోనా వైరస్ బారినపడిన రోగులను రక్షించే చర్యల్లోభాగంగా, 24 గంటలు పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వాయుసేన ఆదివారం ఘనంగా సెల్యూట్ చేసింది.
ఇందులో భాగంగా, దేశవ్యాప్తంగా కరోనా ఆస్పత్రులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పూలవర్షం కురిపించింది. వైద్య సిబ్బందికి ఎయిర్‌ఫోర్స్ ఇస్తున్న అపూర్వ గౌరవం ఇది. డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, సెక్యురిటీ.. ఇలా ఆస్పత్రుల్లోని ప్రతి విభాగానికి కృతజ్ఞతలు తెలుపుతుంది.
విశాఖలో చెస్ట్, గీతం ఆస్పత్రి, హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ బలగాల సంయుక్త విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బందికి సంఘీభావంగా సముద్రతీరాల్లో నౌకలు నిలిపిన నేవీ తమ కృతజ్ఞతను చాటుకుంది.