కరోనా వైరస్ విజృంభణ.. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ సంచలన నిర్ణయం

బుధవారం, 6 జులై 2022 (11:14 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. దీంతో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ముందస్తు చర్యలు సైతం భారీ పటిష్టంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాయి. 
 
ఈ క్రమంలో పలు రాష్ట్రాలు మాస్క్‌ను తప్పని సరిచేశాయి. కాగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మరో అడుగు ముందుకు వేసి ఇప్పుడే మాస్క్ లేకుంటే జరిమానా తప్పదని ప్రకటించింది. 
 
గత 24 గంటల్లో జిల్లాలో 1,066 కరోనా కేసులు నమోదు కావడంతో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
 
ఎవరైనా మాస్క్ లేకుండా బయటకు వస్తే వారికి రూ.500 జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా కరోనా నిబంధనలు ఉల్లఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ సరికొత్త నిబంధన జులై 6 నుంచి అమల్లోకి రానుందని ప్రకటించారు. 
 
వ్యాపారాలు, ఆఫీసుల వారిని సైతం తమ ఉద్యోగులు తప్పకుండా మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలని, సాంఘిక దూరాన్ని తూచా తప్పకుండా పాటించాలని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు