ఏపీలో 21 వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు, 72 మంది మృతి

గురువారం, 6 మే 2021 (20:35 IST)
అమరావతి : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 21,954 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చికిత్సకు 10, 141 మంది కోలుకున్నారు. 72 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆంధ్రప్రదేశ్‌ మొత్తం పాజిటివ్‌ కేసులు 12,28,186కి పెరిగాయి. ప్రస్తుతం 1.82 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు మొత్తం 8,446 మంది మరణించారు. 24 గంటల్లో 1.10 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు