జగనన్న వసతి దీవెన పధకం బదులు లాప్ టాప్

మంగళవారం, 4 మే 2021 (17:39 IST)
ఉన్నత విద్యపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తో మంత్రి సురేష్ మాట్లాడారు. ఇప్పటికే 10వ తరగతి వరకు విద్యార్థులకు వేసవి సెలవులు, ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయటం జరిగింది.

ఈ నేపథ్యంలో ఉన్నత విద్య పై సమీక్షించటం జరిగింది. యూనివర్సిటీ లలో పరీక్షల నిర్వహణ, ఆన్లైన్ తరగతులు నిర్వహించటం, కోవిడ్ ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. ఆన్లైన్ తరగతులు నిర్వహణకు విద్యార్థులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లాప్ టాప్ నిర్ణయం దోహదపడుతుందని అన్నారు.

జగనన్న వసతి దీవెన పధకం బదులు లాప్ టాప్ ఇచ్చే కార్యక్రమంపై సమీక్షించారు. కరోనా తీవ్రత పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధి విధానాలను బట్టి త్వరలోనే ఉన్నత విద్యపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు