కరోనా భయం లేదు, ఆ నగరంలో మాస్కులు ధరించనక్కర్లేదంటున్న చైనా

సోమవారం, 18 మే 2020 (18:48 IST)
కరోనా విజృంభణతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుండగా, ప్రజలు మాస్క్‌లు ధరిస్తూ, వ్యక్తిగత దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే చైనాలోని బీజింగ్ నగర వాసులు మాస్క్‌లు ధరించనవసరం లేదని అక్కడి స్థానిక వ్యాధినిర్మూలన కేంద్రం ప్రకటించింది. దీంతో అక్కడి జనాలు మాస్క్‌లు ధరించకూడా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటూ బహిరంగంగా తిరుగుతున్నారు. 
 
కానీ వ్యక్తిగత దూరం మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రపంచంలో మాస్క్‌లు ధరించనక్కర్లేదని ప్రకటించిన మొదటి నగరం ఇదే. వాతావరణం అనుకూలిస్తే ఆరుబయట వ్యాయామాలు చేసుకోవచ్చని దీనివల్ల ఆరోగ్యం పెంపొందుతుందని సంస్థ ప్రకటించింది. 
 
ఇదిలా ఉండగా మే 22వ తేదీన బీజింగ్‌లో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. దానికి దాదాపు ఐదు వేల మంది హాజరుకానున్నారు. ప్రస్తుత పరిస్థితులపై వ్యూహరచన చేసేందుకు వీటిని నిర్వహించనున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు