ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతోంది. ఫస్ట్ వేవ్‌లో కరోనా వైరస్ వణికించింది. సెకండ్ వేవ్‌లో కరోనా డెల్టా వైరస్ భయభ్రాంతులకు గురిచేసింది. ఇపుడు ఒమిక్రాన్ అనే వేరియంట్ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని గడగడలాడిపోతున్నాయి. ఈ వైరస్ సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వైరస్ కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇప్పటికే ఆఫ్రికా దేశాల నుంచి ప్రయాణికులపై గట్టి నిఘా సారించాయి. ఆ దేశాలకు విమానా రాకపోకలను నిలిపివేస్తున్నాయి. ముఖ్యంగా, ఈ వైరస్ వ్యాప్తి అత్యధికంగా సౌతాఫ్రికా, ఇటలీ, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్, హాంకాంగ్, బోట్స్‌వానా, చెక్ రిపబ్లిక్, బవేరియా, ఆస్టియా, బ్రిటన్ దేశాల్లో ఉంది. దీంతో ఈ దేశాల నుంచి ప్రయాణికులపై ఆంక్షలు విధించారు.