చైనాలో మళ్లీ ఫోర్త్ వేవ్.. షాంఘై‌లో ఇళ్ల చుట్టూ ఫెన్సింగ్

సోమవారం, 25 ఏప్రియల్ 2022 (11:59 IST)
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ ఫోర్త్ వేవ్ ప్రారంభమైంది. కరోనాను నియంత్రించేందుకు ప్రస్తుతం చైనా మల్లగుల్లాలు పడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు అదుపులోకి రాకపోవడంతో మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు అధికారులు. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా జనాలు ఆహారం, మందులు దొరక్క నానా తంటాలు పడుతున్నారు. 
 
తాజాగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న షాంఘై నగరంలో ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. చైనాలో కరోనా కేసుల సంఖ్య ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అదుపులోకి రాకపోవడంతో మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు అధికారులు.
 
ఇప్పటికే అనేక ప్రాంతాలను బారికేడ్లతో మూసివేసిన అధికారులు, ఇప్పుడు కరోనా సోకిన వారి ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రెండు మీటర్ల ఎత్తు ఉన్న ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు