యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కరోనా.. 68మంది సిబ్బందికి కరోనా

సోమవారం, 29 మార్చి 2021 (10:02 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కరోనా కలకలం రేపుతోంది. దేవాలయంలో పనిచేస్తున్న 68 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

దేవాలయంలో అర్చకులతో సహా ఆలయ ఉద్యోగులకు కరోనా సోకడంతో యాదగిరిగుట్ట గ్రామంలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యాదగిరిగుట్టలో కరోనా వైరస్ పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 
 
ఆలయ సిబ్బందికి కరోనా సోకిందని తెలియడంతో భక్తులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. కరోనా కలకలంతో దేవాలయంలో నిత్నాన్నదాన విభాగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనాలను మాత్రమే కొనసాగిస్తామని యాదాద్రి ఆలయ అధికారులు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు