తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆకాంక్షించారు. హరీష్ రావు త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.
అలాగే పలు జాగ్రత్తలు తీసుకుంటూ హరీష్‌రావు త్వరగా కోలుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘గెట్ వెల్ సూన్ బావ’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కోవిడ్ నుంచి హరీష్‌రావు త్వరగా కోలుకోవాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.
మరోవైపు హరీష్‌రావు కరోనా బారిన పడంటంతో ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కాగా హరీష్ రావు కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకున్నానని కరోనా పాజిటివ్ అని రిపోర్టులో వచ్చిందని ఆయన స్వయంగా ట్వట్టర్ ద్వారా వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని, ఐసొలేషన్‌లో ఉండాలని సూచించారు.
ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కవిత కూడా హరీష్ రావు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. 'బావా .. మా ప్రార్థనలన్నీ మీ కోసమే. మీ సంకల్ప బలంతో కరోనా వైరస్‌ను ఓడించాలి' అని ట్వీట్ చేశారు. గెట్ వెల్ సూన్ బావ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇతరుల కంటే మీరు త్వరగా కోలుకుంటారనే నమ్మకం ఉందని కేటీఆర్ అన్నారు.