దేశంలో కరోనా అప్డేట్.. తెలంగాణలో 214 పాజిటివ్‌ కేసులు

శనివారం, 23 జనవరి 2021 (10:37 IST)
దేశంలో గడిచిన 24గంటల్లో 14,256 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,06,39,684కు చేరింది. తాజాగా వైరస్‌ నుంచి 17,130 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. ఇప్పటి వరకు 1.03కోట్ల మంది కోలుకున్నారని కేంద్రం తెలిపింది. 
 
మరో 152 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందగా.. మృతుల సంఖ్య 1,53,184కు పెరిగిందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో 1,85,662 క్రియాశీల కేసులు ఉన్నాయని పేర్కొంది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 13,90,259 మందికి వేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది.
 
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థరణ పరీక్షల్లో కొత్తగా 214 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,93,056కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,588కి చేరింది. 
 
కరోనాబారి నుంచి నిన్న 431 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,87,899కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,569 ఉండగా వీరిలో 1973 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 36 కేసులు నమోదయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు