శుక్రవారం సెషన్‌లో ఉదయం లాభాల్లోనే మార్కెట్లు ప్రారంభమైనప్పటికీ.. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల వైపు సాగడంతో సెన్సెక్స్ ఏకంగా 49వేల దిగువకు పడిపోయింది. దీంతో వరుసగా రెండు రోజులు నష్టపోయినట్లయ్యింది. సెన్సెక్స్ తుదకు 746 పాయింట్లు కోల్పోయి 48,878.54 కనిష్టానికి పడిపోయింది. రిలయన్స్ ఇండిస్టీస్ షేర్ 2.30 శాతం లేదా రూ.48.20 పతనమై రూ.2,049.65కు దిగజారింది.
మిడ్ క్యాప్ సూచీ 1.1 శాతం, స్మాల్ క్యాప్ 0.93 శాతం చొప్పున తగ్గాయి. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 14,372 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఏకంగా 218 పాయింట్ల నష్టంతో 14372కు దిగజారింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో తప్పా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి.