తిరుపతిలో ఆగస్టు 5వరకు లాక్‌డౌన్.. 6నుంచి 10 గంటల వరకే షాపులు

సోమవారం, 20 జులై 2020 (22:58 IST)
కరోనా వైరస్ విజృంభించడంతో సోమవారం నుంచి తిరుపతిలో లాక్‌డౌన్ విధించనున్నారు. ఈ లాక్‌డౌన్ వచ్చేనెల అంటే ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగుతోంది. ఇటీవలి రోజుల్లో కోవిడ్-19 కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులపై లాక్‌డౌన్‌ ప్రభావం ఉండదని అధికారులు చెప్తున్నారు. 
 
కూరగాయలు, కిరాణా సామాగ్రి విక్రయించే దుకాణాలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య తెరవడానికి అనుమతిస్తారు. అయితే, అన్ని వాణిజ్య సంస్థలు లాక్డౌన్ సమయంలో మూసివుంచుతారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ నారాయణ భారత్‌ గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. కేవలం నాలుగు గంటల సమయంలోనే షాపింగ్ చేయడానికి ప్రజలను అనుమతిస్తారని చెప్పారు. 
 
మెడికల్ మిల్క్ షాపులు రోజంతా పనిచేస్తాయని, అలాగే అత్యవసర సేవలను లాక్డౌన్ పరిధి నుండి మినహాయించినట్లు తెలిపారు. వాహనాల్లో వచ్చే యాత్రికులు తిరుపతిని దాటవేసి బైపాస్ మార్గంలో వెళ్లేలా అధికారులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు