దేశంలో లక్షన్నరకు చేరువైన కరోనా పాజిటివ్ కేసులు

శుక్రవారం, 22 జులై 2022 (12:46 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 21880 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 60 మంది చనిపోయారు. 
 
దేశంలో 4,95,359 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, వీరిలో 21,880 మందికి కరోనా వైరస్ సోకినట్టు తెలిపింది. అలాగే, కరోనా నుంచి 21,219 మంది విముక్తులయ్యారు. వీరితో కలుపుకుని కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,31,71,653కు చేరింది. మరోవైపు, తాగా మృతి చెందిన 60 మందితో కలుపుకుంటే మొత్తం చనిపోయిన వారి సంఖ్య 5,25,930కి చేరింది. 
 
ఇటీవలికాలంలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య కంటే ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,49,482 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే, దేశంలో క్రియాశీల రేటు 0.34 శాతంగాను, రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు