అలాగే, ఈ వైరస్ బారినుంచి సుమారు 37 వేల మంది కోలుకున్నారు. ఇక గత 24 గంటల్లో వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 339గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకు 4,43,213 మంది చనిపోయారు.
మరోవైపు, దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటికే 75 కోట్ల మార్క్‌ను దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ట్వీట్ చేశారు. గత 24 గంటల్లో 78,66,950 మందికి కరోనా టీకా వేసినట్లు ఆయన చెప్పారు.