దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువేనని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ రమణ్ గంగాఖేడ్కర్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువుగా ఉన్నాయన్నారు. అయినప్పటికీ... చిన్నారులను ఇప్పుడే స్కూళ్లకు పంపొద్దని సూచించారు.