దేశంలో 10 వేలకు చేరుకున్న పాజిటివ్ కేసులు

మంగళవారం, 2 నవంబరు 2021 (11:00 IST)
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్త కరోనా కేసులు 10 వేలకు చేరుకున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు... 24 గంటల్లో 10,243 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు పేర్కొంది. అలాగే, 443 మంది మృతి చెందారు. 
 
అలాగే కరోనా నుంచి కోలుకుని 15,021 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,42,96,237కి చేరింది. అలాగే మొత్తం 3,36,83,581 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
ప్రస్తుతం  1,53,776 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,58,880గా ఉంది. 1,06,85,71,879 మంది టీకా తీసుకున్నారు. 
 
ఇదిలావుంటే, బెంగళూరులో సుదీర్ఘ విరామం అనంతరం కొవిడ్‌ కేసులు తక్కువగా నమోదయ్యాయి. మృతులు కూడా లేక పోవడం గమనార్హం. సోమవారం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 188 మందికి పాజిటివ్‌ సోకగా బెంగళూరులో 95 మందికి ప్రబలింది. 10 జిల్లాల్లో ఒ క్కకేసు కూడా నమోదుకాలేదు. 
 
16 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదు కాగా ఇతర జిల్లాల్లో 20లోపు నమోదయ్యారు. 318మంది కోలుకోగా ఇద్దరు మృతి చెందారు. మృతులు ఇరువురూ మైసూరు జిల్లా వాసులే. రాష్ట్రంలో ప్రస్తుతం 8,512 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరులో 6,478 మంది ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు